![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Braamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-799 లో... కావ్యకి అప్పు మామిడికాయ ఇస్తుంటే.. మీ అక్క ఏమైనా ప్రెగ్నెంటా అని రుద్రాణి అడుగుతుంది. ఇది పుల్లటి మామిడికాయ కాదు తియ్యగా ఉంది. ఎవరైనా తినొచ్చని అప్పు, కావ్య కలిసి రుద్రాణిని పిచ్చిదాన్ని చేస్తారు. అప్పుడే ఇందిరాదేవి వెళ్తుంటే రుద్రాణి పిలుస్తుంది. ఈ మామిడికాయ తిని పుల్లగా ఉందో తియ్యగా ఉందో చెప్పమని అడుగుతుంది. ఇందిరాదేవి కూడా అప్పు వాళ్ళకి సపోర్ట్ గా ఇది తియ్యగా ఉందని చెప్తుంది. దాంతో రుద్రాణి ఏం చెయ్యలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మీరు కాస్త దానితో జాగ్రత్తగా ఉండండి అని అప్పు, కావ్యలకి ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత కనకంకి స్వప్న ఫోన్ చేసి అప్పు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తుంది. అలాగే రాజుని కావ్య రిజెక్ట్ చేసిన విషయం కూడా చెప్తుంది. మరుసటి రోజు ధాన్యలక్ష్మి అప్పుని కోడలుగా ఒప్పుకొని తన ఏడు వారాల నగలు ఇస్తుంది. అప్పుడే కనకం వస్తుంది. అప్పుని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. రాజ్ వస్తాడు ఎందుకు అల్లుడు గారిని వద్దని అన్నావని కావ్యని కనకం కోప్పడుతుంది. నా లైఫ్ నా ఇష్టమని కావ్య చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కనకాన్ని బయటకు తీసుకొని వెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తారు. దాంతో కనకం కావ్య దగ్గరికి కనకం వెళ్లి బాధపడుతుంది.
ఆ తర్వాత కావ్య, కనకం ఇద్దరు మాట్లాడుకుంటుంటే.. రుద్రాణి డోర్ దగ్గర ఉంటుంది. అది స్వప్న చూసి చూసి ఇండైరెక్ట్ గా రుద్రాణి ని తిడుతుంది. తరువాయి భాగంలో కావ్య టాబ్లెట్స్ వేసుకోవడం రాహుల్, రుద్రాణి చూసి ఆ టాబ్లెట్ ఎందుకు వేసుకుంటారో తెలుసుకుంటారు. ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు వేసుకుంటారని రుద్రాణికి తెలుస్తుంది. అయితే కావ్య ప్రెగ్నెంట్ అనుకొని యామినికి ఫోన్ చేసి చెప్తుంది రుద్రాణి. కావ్య ప్రెగ్నెంటా.. అయితే ఈ విషయం బావతో చెప్పి కావ్యని నెగెటివ్ చేస్తానని యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |